ENGLISH

మోనాల్‌ కన్నింగ్‌.. దివి చెప్పిందే రైట్‌.!

13 October 2020-16:37 PM

హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌, ఈ సీజన్‌కి సంబంధించి మోస్ట్‌ గ్లామరస్‌ బ్యూటీ. తన గ్లామర్‌ని అవసరానికి తగ్గట్టుగా ఒకలబోసే క్రమంలో ఓ ‘స్ట్రాటజీ’ని మోనాల్‌ అవలంబిస్తోందన్నది నిర్వివాదాంశం. గ్లామర్‌ ఒక్కటే సరిపోతుందా.? బిగ్‌బాస్‌ అంటే, అందులో చాలా వుంటాయ్‌. అన్నిటికన్నా ముఖ్యమైనది జెన్యూనిటీ. ఈ విషయంలో మోనాల్‌ గజ్జర్‌కి ప్రతిసారీ మైనస్‌ మార్కులు పడుతున్నాయి. మోనాల్‌కి దాదాపుగా హౌస్‌లో అందరికీ ఇష్యూస్‌ వున్నాయి. అన్నిట్లోనూ ఒకటే కంప్లయింట్‌ కామన్‌గా కనిపిస్తుంటుంది.

 

అదే, ‘జెన్యూన్‌గా వుండదు’ అని. ‘నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేను..’ అని దివి ఓ సందర్భంలో మోనాల్‌ మొహమ్మీదే చెప్పేసింది.. అదీ హోస్ట్‌ నాగార్జున సాక్షిగా. ఈ విషయంలో అబిజీత్‌ వాదన కూడా దాదాపుగా ఇలాగే వుంది. అబిజీత్‌ - అఖిల్‌ మధ్య తాను నలిగిపోతున్నట్లుగా మోనాల్‌ ‘బిల్డప్‌’ ఇస్తోంది. ‘నన్ను వదిలెయ్‌ ప్లీజ్‌..’ అని అబిజీత్‌ మొత్తుకుంటున్నా మోనాల్‌ వదలడంలేదు. అఖిల్‌ కూడా, మోనాల్‌ ‘డబుల్‌ గేమ్’ కారణంగా విసిగిపోయాడు.

 

అయితే, అఖిల్‌.. మోనాల్‌కి తెగేసి చెప్పలేకపోతున్నాడు. ఎవర్నయినా నామినేట్‌ చేసే క్రమంలోనూ మోనాల్‌ గజ్జర్‌, మనసుతో ఆలోచించడంలేదు. నిజానికి, గత వారం నామినేషన్స్‌ సందర్భంగా ఇటు అబిజీత్‌, అటు అఖిల్‌ కారణంగా మోనాల్‌ చాలా చాలా ఏడ్చింది. ఆ లెక్క, ఆ ఇద్దర్నీ మోనాల్‌ నామినేట్‌ చేసి వుండాలి. కానీ, చేయలేదు. దాంతో మోనాల్‌ జెన్యూనిటీ ఇంకోసారి వివాదాస్పదమయ్యింది.

ALSO READ: ప్లీజ్... రాజ‌కీయాల్లోకి రావొద్దు!