ENGLISH

సీక్రెట్‌ రూం: సూపర్‌ డూపర్‌ ‘బిగ్‌’ ఫ్లాప్‌.!

12 November 2020-18:00 PM

ఏదో అనుకుంటోంటే, ఇంకోటేదో అవుతోంది. ఆడియన్స్‌లో అస్సలేమాత్రం ఆసక్తిని రేకెత్తించలేకపోతోంది బిగ్‌ బాస్‌ తెలుగు రియాల్టీ షో నాలుగో సీజన్‌. ఈ వారం ఏం జరగబోతోంది.? అన్న విషయమై ముందు వారమే ఓ అవగాహన వచ్చేస్తోంది ఆడియన్స్‌కి. ఎవరు నామినేట్‌ అవుతారు.? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు.? అనేది ఆడియన్స్‌ ముందుగానే చెప్పేస్తున్నారు.

 

ఇది బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌గా అభివర్ణిస్తున్నారు ఆడియన్స్‌. తాజా ఎపిసోడ్‌లో సీక్రెట్‌ రూం వ్యవహారం చాలా సిల్లీగా తయారైంది. హౌస్‌ మేట్స్‌ అంతా కలిసి స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్‌ని హౌస్‌ నుంచి బయటకు పంపేయాలి. ఇదీ టాస్క్‌. అబిజీత్‌ ఒప్పుకోలేదు, లాస్య ఒప్పుకోలేదు, హారిక కూడా ససేమిరా అంది. కానీ, హౌస్‌ నుంచి అఖిల్‌ సార్ధక్‌ బయటకి వెళ్ళిపోయాడు. నిజంగానే బయటకు కాదు, సీక్రెట్‌ రూంలోకి. ఆ విషయం హౌస్‌ మేట్స్‌కి కూడా అర్థమయిపోయినట్టుంది.

 

‘నువ్వు వింటున్నావు, చూస్తున్నావని తెలుసు..’ అంటూ అబిజీత్‌, అఖిల్‌కి చెప్పాలనుకున్నది చెప్పేశాడు.. బయటకు వెళ్ళాక కూడా. కానీ, మోనాల్‌ గజ్జర్‌ పెద్ద డ్రామా ప్లే చేసింది ఏడుస్తూ. సోహెల్‌ కూడా అలాంటిదే ట్రై చేశాడు, ‘నాకు నిద్ర పట్టట్లేదురా..’ అని చెబుతూ. హౌస్‌ మేట్స్‌కి కూడా అర్థమయ్యింది ఇది సీక్రెట్‌ రూం వ్యవహారమేనని. ఆఖరికి అఖిల్‌ కూడా డిసైడ్‌ అయిపోయాడు. మరెందుకు సీక్రెట్‌ రూం. తామేదో గొప్ప సస్పెన్స్‌ నడిపేస్తున్నామని బిగ్‌బాస్‌ టీం అనుకుంటోంటే, అంతా హంబక్‌ అని ఆడియన్స్‌ తేల్చేస్తుండడమే పెద్ద కామెడీ.

ALSO READ: పారితోషికం కోసం బెట్టు చేస్తున్నాడా?