ENGLISH

బయోపిక్‌ - ఈసారి టీమిండియా కెప్టెన్‌ మిథాలీరాజ్‌పై

26 September 2017-17:36 PM

మహిళా ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పేరు ఇప్పుడు ఎక్కడ విన్నా మార్మోగిపోతోంది. ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆమె బయోపిక్‌ని సినిమాగా తెరకెక్కించాలనే యోచనలో కొన్ని సినీ నిర్మాణ సంస్థలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య బయోపిక్స్‌కి ఆదరణ చాలా బాగుంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్స్‌కి మరింత డిమాండ్‌ ఉంది. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ కోసం ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌ కసరత్తులు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది ఈ సినిమాలో. ఇప్పటికే ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ధోనీ బయోపిక్‌ వచ్చింది మంచి రెస్పాన్స్‌ అందుకుంది. అలాగే కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ కూడా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు వయా కామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలియవస్తోంది. ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే డీటెయిల్స్‌ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ బయోపిక్‌కి సంబంధించిన పూర్తి డీటెయిట్స్‌ త్వరలోనే వెల్లడి కానున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత గాథలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చి అందరూ కీర్తించదగ్గ స్థాయికి ఎదుగుతారు. అందుకే అలాంటి వారి చరిత్రలను తెలుసుకోవడంలో ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్‌నీ, క్యూరియాసిటీని కమర్షియల్‌ ఎలిమెంట్‌గా తీసుకుని సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఏ రకంగా చూసినా ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్‌కి దృశ్యరూపం కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమే.

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..