ENGLISH

'సవ్యసాచి' కోసం రొమాంటిక్‌ హీరో వస్తున్నాడోచ్‌

26 September 2017-17:33 PM

ఏ భాషకి చెందిన హీరోలు ఆ భాషలోనే నటించాలి అనే రూల్స్‌ ఎప్పుడో మారిపోయాయి. ప్రస్తుతం యంగ్‌ హీరోలు ఇతర భాషా చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌లో నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఆ మాటకొస్తే, యంగ్‌ హీరోలే కాదు, సీనియర్‌ హీరోలు కూడా. జగపతిబాబు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అలాగే తమిళం నుండీ పలువురు హీరోలు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ, కన్నడ భాషల్లోని సీనియర్‌ స్టార్స్‌ మన తెలుగులో సత్తా చాటుతున్నారు. గెస్ట్‌ రోల్స్‌ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్స్‌కి చాలా హైప్‌ క్రియేట్‌ అవుతోంది ప్రస్తుత రోజుల్లో. అలాగే తాజాగా తమిళంలో రొమాంటిక్‌ హీరో అయిన మాధవన్‌ తెలుగులో నటించబోతున్నాడనీ సమాచారమ్‌. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమాలో మాధవన్‌ నటిస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, మాధవన్‌కి తమిళంలోనే కాదు, తెలుగులోనూ పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన గత చిత్రాలకు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తెలుగులో నటిస్తే ఆ సినిమాకి ప్లస్సే అవుతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ ఛాలెంజింగ్‌ రోల్‌లో నాగ చైతన్య నటిస్తున్నాడు ఈ సినిమాలో. సినిమాకి ఎంతో కీలకమైన ఓ రోల్‌ కోసం చిత్ర యూనిట్‌ మాధవన్‌తో సంప్రదింపులు చేసిందనీ సమాచారమ్‌. ఈ విషయంపై అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది.

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..