ENGLISH

పుష్ప 2 విజయాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేక పోతోందా?

28 December 2024-12:31 PM

'పుష్ప‌-2' అసలు సిసలైన పాన్ ఇండియా మూవీ అనిపించుకుంది. ఒక తెలుగు హీరో సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. అల్లు అర్జున్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసింది. సౌత్ సంగతి పక్కనపెడితే నార్త్ లో మంచి వసూళ్లు చేసి ఆహా అనిపించింది. బాలీవుడ్ లో 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌తో అత్యధిక కలక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక తెలుగు సినిమా హిందీలో ఈ రేంజ్ లో వసూల్ చేయటం మామలు విషయం కాదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని చెప్పుకునే హిందీ యాక్టర్స్ పుష్ప క్రేజ్ ముందు తేలిపోయారు. ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియాలో సత్తాచాటుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి చెప్పుకోదగిన హిట్ లేదు.

ఈ మధ్య కాలంలో వచ్చిన షారుఖ్ 'జవాన్' కి కొంత క్రెడిట్ సౌత్ డైరక్టర్, సౌత్ హీరోయిన్ కి దక్కింది. యానిమల్ మూవీ హిట్ క్రెడిట్ కూడా టాలీవుడ్ డైరక్టర్ సందీప్ వంగా, హీరోయిన్ రష్మిక షేర్ చేసుకున్నారు. అయినా ఇప్పటికీ టాలీవుడ్ పై అదే చిన్న చూపు వహిస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు. ఒక హిందీ సినిమా బాగుంటే నిజాయితీగా మన హీరోలంతా రివ్యూ ఇస్తూ, కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. కానీ తెలుగు సినిమా హిట్ అయితే కనీసం ఒక్కరు కూడా ప్రశంసించటం లేదు. కల్కి విషయం లో ఇదే జరిగింది, ఇప్పుడు పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది.

అమిర్ ఖాన్ 'దంగ‌ల్' రికార్డును బ్రేక్ చేసే దిశగా పుష్ప రాజ్ జర్నీ ఉంటే బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా ఈ సినిమాపై స్పందించకపోవటం గమనార్హం. హిందీ సినిమా రిలీజ్ అయితే తప్పుడు లెక్కలు చెప్పి ఇంత వసూల్ చేసింది అంత అని గొప్పలు చెప్పుకునే ఇండస్ట్రీ నిజాయితీగా ఉన్న వసూళ్ల లెక్కలపై స్పందించలేకపోయారు. ఇది ఇండియన్ సినిమా అని చూడకుండా కేవలం టాలీవుడ్ సినిమాగా చూస్తూ అహం చూపిస్తున్నారు. కేవలం య‌శ్ రాజ్ ఫిలింస్ జవాన్ ని బీట్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేసింది. బిగ్ బి అమితాబ్ కూడా పుష్ప 2 సినిమా గూర్చి, బన్నీ గూర్చి మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

త‌మిళ సినిమాలు స‌క్సెస్ అయితే టీమ్ ని ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసే షారుక్ ఖాన్ ఇపుడు పుష్ప 2 విషయంలో మౌనంగా ఉన్నారు. ఒక్కరు కూడా స్పందించలేకపోయారు. అయినా ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి ఒక్క తెలుగు సినిమాకి కూడా ప్రశంసలు రాకపోవటం గమనించాల్సిన విషయం. కానీ మన హీరోలు, డైరక్టర్స్ హిందీ సినిమాల్ని సౌత్ లో ప్రమోట్ చేస్తూ వారికి ప్రోత్సహాకంగా ఉంటున్నారు.