ENGLISH

2025 క్యాలెండర్ రష్మికదే

28 December 2024-13:05 PM

నేషనల్ క్రష్ రష్మిక హవా మాములుగా లేదు. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అవుతూ బిగ్గెస్ట్ హిట్ లు అందుకుంటోంది. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ ఏడాది పుష్ప 2 తో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2023, 24 లలో వరస విజయాలు తన ఖాతాలో వేసుకున్న రష్మిక 2025 కూడా తనదే అంటోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలున్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావటం విశేషం. ఈ ఏడాది ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన రష్మిక నెక్స్ట్ ఇయర్ ఏకంగా ఐదు సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయనుంది.

ప్రస్తుతం రష్మిక హిందీలో విక్కీకౌశల్ కి జోడిగా 'ఛావా' మూవీ చేస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శివాజీ పెద్ద కొడుకు, మరాఠా వీరుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కు తోంది చావా. 2025 ఫిబ్రవరిలో చావా రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేస్తోంది. ఈ మూవీని మురుగుదాస్ తెరకెక్కిస్తున్నారు. సికిందర్ 2025 ఈద్ స్పెషల్ గా మార్చ్ లో రిలీజ్ అవుతోంది. మురుగుదాస్ మూవీ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' అనే బైలింగ్వల్ మూవీ లో రష్మిక లీడ్ రోల్ చేస్తోంది. ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ కూడా సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర రూపొందుతోంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025 ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇవి కాక బాలీవుడ్ లో 'థమా' అనే హార్రర్ కామెడీ మూవీలో ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా రష్మిక నటిస్తోంది. 2025 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

వీటితో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో ఫిక్స్ అయ్యింది. రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న'ధురంధర్' అనే మూవీలోను రష్మిక నటిస్తోంది. 'వార్ 2' మూవీలో కూడా నటిస్తోంది అని సమాచారం. మొత్తానికి 2025 లో రష్మిక హవా మాములుగా లేదు.

ALSO READ: పుష్ప 2 విజయాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేక పోతోందా?