ENGLISH

బాపు రమణల బయోపిక్ లో నాని-శర్వా నంద్ ?

28 December 2024-13:37 PM

బ‌యోపిక్ లు ఎక్కువగా బాలీవుడ్ లోనే తెరక్కెక్కాయి. సౌత్ లో బయోపిక్ ల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు రిస్క్ అని వెనక్కి తగ్గుతారు. బయోపిక్ తీసి టెన్షన్ పడే కంటే కమర్షియల్ సినిమా అయితే బెటర్ అనుకుంటారు. కానీ ఈ లెక్కలన్నీ మహానటి మూవీకి ముందు. నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో బయోపిక్ ల పై కొందరి ద్రుష్టి మరలింది. మహానటి తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ రూపొందించారు. కథానాయకుడు అన్న పేరుతో రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తరవాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌యోపిక్ లు కూడా తెర‌కి తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ తెరెక్కుతోంది. ఇందులో ధనుష్ ఇళయరాజా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పడు టాలీవుడ్ ప్రముఖులు, దోస్తులు అయిన బాపు, రమణల బయోపిక్ తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. సాయి మాధ‌వ్ బుర్రా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విషయాన్ని చెప్తూ ఆ పాత్రల్లో నేచుర‌ల్ స్టార్ నాని - శ‌ర్వానంద్ లు నటిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయ పడ్డారు. ఎవరైనా ముందుకు వస్తే బాపు-ర‌మ‌ణల క‌థ‌ను సాయి మాధ‌వ్ స్క్రిప్ట్ రూపంలో రాసి ఇస్తానని పేర్కొన్నారు.

ఇది విన్న నెటిజన్స్ ఎవరో ఎందుకు మాస్టారు మీరే మెగాఫోన్ పట్టండి అని విన్నవిస్తున్నారు. ఇప్ప‌టికే స్టార్ రైట‌ర్ గా మంచి గుర్తింపు పొందిన సాయి మాధవ్ కి ఆ సత్తా ఉందని, పైగా బాపు రమణల లాంటి లెజండరీస్ స్టోరీని సాయి మాధవ్ తెరకెక్కిస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. నాని, శర్వా నంద్ మంచి ఛాయిస్ అని, ఆల్ రెడీ నానికి బాపు దగ్గర వర్క్ చేసిన అనుభవం ఉందని, పలువురు పేర్కొంటున్నారు. నిజంగా ఇదే నిజమైతే  బాపు రమణల్ని ఈ జనరేషన్ కి పరిచయం చేసిన వారు అవుతారు సాయి మాధవ్.

ALSO READ: 2025 క్యాలెండర్ రష్మికదే