ENGLISH

బోయపాటి-నాగ చైతన్య సినిమా పైలేటెస్ట్ అప్డేట్

17 June 2017-15:42 PM

బోయపాటి శ్రీను తన తరువాతి చిత్రం అక్కినేని నాగ చైతన్య తో ఉంటుంది అని ఫిలిం నగర్ లో తాజాగా వినిపిస్తున్న రూమర్.

అయితే ఈ రూమర్ లో ఎటువంటి నిజం లేదని బోయపాటి సన్నిహిత వర్గాల ద్వారా తెలియవస్తున్న సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం పూర్తయ్యాక ఎవరితో చేస్తాడు అనేదాని పైన ఇంకా క్లారిటీ రావల్సివుందట.

ప్రస్తుతం నాగ చైతన్య కూడా ఇంకాపేరు ఖారారు కాని చిత్ర షూటింగ్ కోసం అరకు వెళ్ళాడు. ఇక బోయపాటి తన నెక్స్ట్ తీయబోయే సినిమా కథాచర్చల్లో అదే విధంగా జై జానకి నాయకా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

సో.. బోయపాటి-చైతుల ప్రాజెక్ట్ ఒట్టి రూమర్ గా తేలిపోయింది.

 

ALSO READ: నారా-నందమూరి హీరోల మద్య వార్?