ENGLISH

దాస‌రి త‌న‌యుల‌పై పోలీసు కేసు

31 July 2021-15:34 PM

దివంగ‌త ద‌ర్శ‌కుడు దాస‌రి త‌న‌యులైన అరుణ్ కుమార్‌, ప్ర‌భుల‌పై హైద‌రాబాద్ జూబ్లీహీల్స్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఫైనాన్షియ‌ర్ సోమ‌శేఖ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్ రికార్డు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే..

 

దాస‌రి నారాయ‌ణ‌రావు చాలా ఏళ్ల క్రితం సోమ శేఖ‌ర్ ద‌గ్గ‌ర 2.15 కోట్లు అప్పుగా తీసుకున్నారు. దాస‌రి మ‌ర‌ణించాక‌.. వార‌సులిద్ద‌రితోనూ సోమ‌శేఖ‌ర్‌కి సెటిలెమెంట్ జ‌రిగింది. రూ.2.15 కోట్లు చెల్లించ‌లేమ‌ని దాస‌రి త‌న‌యులు చేతులు ఎత్తేయ‌డంతో ఆ మొత్తాన్ని 1.10కి కుదించారు. ఈ మొత్తాన్ని ఏడాదిలోపు చెల్లిస్తామ‌ని 2017లోనే అగ్రిమెంట్ జ‌రిగింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ సొమ్ముని తిరిగి చెల్లించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై సోమ‌శేఖ‌ర్ ఎన్నిసార్లు సంప్ర‌దించినా.. ప్ర‌భు, అరుణ్‌లు స్పందించ‌డం లేద‌ట‌. తీసుకున్న అప్పు చెల్లించ‌క‌పోగా, త‌న‌ని బెదిరిస్తున్నార‌ని, ఈ విష‌యంలో న్యాయం చేయ‌మ‌ని.. సోమ‌శేఖ‌ర్ పోలీసుల్ని సంప్ర‌దించారు. ప్ర‌స్తుతం ప్ర‌భు, అరుణ్ ల‌ను పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు. ఇది వ‌ర‌కు ప్రభు, అరుణ్ ల మ‌ధ్య ఆస్తి త‌గాదాలు రావ‌డం, వాటిని ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌లు ప‌రిష్క‌రించ‌డం తెలిసిన విష‌యాలే.

ALSO READ: ఆ ల‌క్ష క‌ట్టలేవా విజ‌య్‌..?!