ENGLISH

'వకీల్‌ సాబ్‌' అంతలా మారిపోయాడా.?

02 January 2021-10:03 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు 'వకీల్‌ సాబ్‌' సినిమాతో. రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాల్ని దాదాపుగా వదిలేసిన పవన్‌ కళ్యాణ్‌, తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమవడం, ఈ క్రమంలో ఇప్పటికే ఐదు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం తెలిసిన విషయమే. ఇక, 'వకీల్‌ సాబ్‌' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ 'వకీల్‌ సాబ్‌', బాలీవుడ్‌ సినిమా 'పింక్‌'కి తెలుగు రీమేక్‌. ఒరిజినల్‌ వెర్షన్‌లో, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ వుండవు. కానీ, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి, చాలా మార్పులు చేసినట్లే కనిపిస్తోంది. హీరోయిన్‌ శృతిహాసన్‌తో పవన్‌ కళ్యాణ్‌ రొమాంటిక్‌ ట్రాక్‌ గురించి టాలీవుడ్‌లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

ఈ ఎపిసోడ్‌ సినిమాలో హైలైట్‌ కాబోతోందట. అలాగని, ఒరిజినల్‌ వెర్షన్‌లోని మెయిన్‌ కాన్సెప్ట్‌ ఎక్కడా దెబ్బతినకుండా దర్శకుడు వేణు శ్రీరామ్‌ జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇదిలా వుంటే, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 'వకీల్‌సాబ్‌' టీమ్‌ విడుదల చేసిన పోస్టర్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. వింటేజ్‌ పవర్‌ స్టార్‌.. అంటూ పవన్‌ కళ్యాణ్‌ గత సినిమాలు 'జల్సా', 'తీన్‌మార్‌'లను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఇంకోపక్క 'వకీల్‌ సాబ్‌' అన్న పేరుకి, రాజకీయాల్లో వచ్చిన ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ సినిమాకి అది పబ్లిసిటీ పరంగా అదనపు అడ్వాంటేజ్‌ కానుంది. సంక్రాంతికి 'వకీల్‌ సాబ్‌' టీజర్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ALSO READ: గతం గతః మర్చిపోవాల్సిందేనంటోన్న టాలీవుడ్‌