ENGLISH

తమిళ పొన్నుగా మారిపోయిన ఇస్మార్ట్‌ బ్యూటీ.!

02 January 2021-09:07 AM

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి వచ్చి, అచ్చ తెలుగమ్మాయిలా మారిపోయిన ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌, ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి వెళ్ళి, 'తమిళ పొన్ను'గా మారిపోయింది. 2021 తనకు చాలా చాలా స్పెషల్‌ అనీ, తాను నటించిన రెండు తమిళ సినిమాలు ఈ పొంగల్‌ సీజన్‌లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయనీ చెబుతోంది నిధి అగర్వాల్‌. తమిళంలో నిధి అగర్వాల్‌ నటించిన 'భూమి' చిత్రం ఇప్పటికే ఓటీటీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. మరోపక్క ఆమె నటించిన 'ఈశ్వరన్‌' సినిమా ఈ సంక్రాంతికి థియేటర్లలో కళకళ్ళాడబోతోంది.

 

బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు తమిళ సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోన్న నిధి, ఈ ఏడాదిలో తన నుంచి మరిన్ని రిలీజ్‌లు తమిళంలో వుంటాయని చెబుతోంది. తెలుగు సినిమాల మాటేమిటి.? అంటే, తమిళంలో సినిమాలు చేసినా, తెలుగమ్మాయిగా తనకు దక్కిన ఆదరణని ఎప్పటికీ మర్చిపోలేననీ, తెలుగు సినిమాలకి ఎప్పుడూ అందుబాటులోనే వుంటానని సమాధానమిచ్చింది ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తోంది నిధి అగర్వాల్‌. వాటిల్లో మహేష్‌బాబు మేనల్లుడు హీరోగా నటిస్తున్న సినిమా ఒకటి.

 

నటన, గ్లామర్‌.. ఈ రెండూ సమపాళ్ళలో రంగరిస్తేనే, సరైన గుర్తింపు వస్తుందంటోన్న నిధి అగర్వాల్‌, భాష తనకు ఎప్పుడూ ఇబ్బందికరంగా మారలేదనీ, తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు నేర్చుకున్నాననీ, తమిళ సినిమాలు చేస్తూ తమిళం కూడా నేర్చుకుంటున్నానని ఓ ప్రశ్నకు బదులిచ్చింది ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌.

ALSO READ: Nidhi Agarwal Latest Photoshoot