ENGLISH

చలి చంపేస్తోంది బాబోయ్‌: ఛార్మి

02 June 2017-11:57 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పోర్చుగల్‌లో జరుగుతోంది. అక్కడి చలి వాతావరణాన్ని చిత్ర యూనిట్‌ బాగా ఎంజాయ్‌ చేస్తోంది. అయితే చలి చంపేస్తోంది బాబోయ్‌ అని ఛార్మి సోషల్‌ మీడియా ద్వారా షూటింగ్‌ కబుర్లను వెల్లడిస్తోంది. బాలకృష్ణ సరసన శ్రియ, ముస్కాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'రేసుగుర్రం' ఫేం ఐటమ్‌ పోరీ కిరా దత్‌ లేటెస్ట్‌గా సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యిందట. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్వహిస్తోన్న 'పూరి కనెక్ట్స్‌' ద్వారా ఇందులో చాలామంది నటీనటుల్ని పరిచయం చేస్తున్నారు. అయితే ఛార్మి ఈ సినిమాలో నటిస్తుందో లేదో తెలీదు. కానీ టెక్నికల్‌గా ఈ సినిమాకి సంబంధించి ఛార్మి తన పాత్ర తాను పోషిస్తోందట. మరో పక్క ఛార్మితో ఈ సినిమాలో బాలయ్యకు ఐటెం సాంగ్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఛార్మి సినిమాల్లో నటించడం లేదు. కానీ మంచి అవకాశం కోసం చూస్తోందట. పూరీ డైరెక్షన్‌లో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' సినిమాకి సీక్వెల్‌ తీసే యోచనలో కూడా ఛార్మి ఉన్నట్లు తెలియ వస్తోంది. ఇకపోతే ఈ తాజా సినిమా షెడ్యూల్‌ దాదాపుగా పూర్తి కానుంది. పోర్చుగల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను, పోరాట ఘట్టాలను తెరకెక్కించింది చిత్ర యూనిట్‌. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్