ENGLISH

హాట్‌ సమంత - స్వీట్‌ నాగచైతన్య

02 June 2017-11:55 AM

విదేశాల్లో వెకేషన్‌లో బిజీగా ఉన్నారు సమంత, నాగచైతన్య. ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నారు. వెకేషన్‌లో సమంత తన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోల రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. స్విమ్మింగ్‌ పూల్‌లో సమంత మైమరచిపోతోంది. ఆమె ఎంజాయ్‌మెంట్‌ని షేర్‌ చేసుకుంటున్న నాగచైతన్య, సూపర్బ్‌ ఫొటోగ్రాఫర్‌గా అవతారమెత్తుతున్నాడు. ఇదివరకే సమంత ఫొటోల్ని అద్భుతంగా తీసిన నాగచైతన్య, ఇప్పుడూ అంతకన్నా అద్భుతమైన ఫొటోలు తీస్తున్నాడట. ఆ ఫొటోల్నే సమంత సోషల్‌ మీడియాలో పెడుతోంది. హీరోగానే కాకుండా, తన అందమైన భార్య అంద చందాలను హాట్‌ ఫోటోలను తన కెమెరాలో బంధించడంలోనూ చైతూ సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడు. ఈ అందాల జంట త్వరలోనే ఇండియాలో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే నాగచైతన్య హీరోగా నటించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సినిమాతో చైతూ. మరో పక్క సమంత, రామ్‌ చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. వేసవి ఎండల తాపం కారణంగా కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్‌కి విరామం రావడంతో ఇదిగో ఇలా తన ఉడ్‌బీతో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తోందన్న మాట క్యూట్‌ సమంత.

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్