లోకనాయకుడు కమల్ హసన్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి బయటి వారినుండి విమర్శకులు ఎదురుకుంటునే ఉన్నాడు. అయితే ఈసారి వ్యతిరేకత స్వంత ఇంటి నుండి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, కమల్ హసన్ పెద్ద సోదరుడు జాతీయ అవార్డు గ్రహీత అయిన చారు హసన్ ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ- కమల్ హసన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన అంతగా నేగ్గుకురాలేడు అని చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో రజినీకాంత్ రాజకీయ భవిష్యత్తు గురించి ప్రస్తావించగా, అసలు ఆయన రాజకీయాల్లోకి రాడు అని జ్యోత్స్యం చెప్పాడు.
మొత్తానికి కమల్ సోదరుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన రాజకీయ ఎంట్రీకి కొంత ఇబ్బందిగా మారింది.
ALSO READ: ప్రముఖ తెలుగు యాంకర్ మృతి