ENGLISH

ఈ సినిమా కూడా ఓటీటీలో హిట్!

29 April 2021-11:00 AM

ఓటీటీ ప్రేక్ష‌కులు, థియేట‌ర్ ప్రేక్ష‌కులు వేర‌న్న‌ది సినీ జ‌నాల న‌మ్మ‌కం. అది నిజ‌మ‌న్న సంగ‌తి రుజువు అవుతూనే ఉంది. నాగార్జున `వైల్డ్ డాగ్` థియేట‌ర్లో ఎవ‌రూ చూళ్లేదు. మంచి రివ్యూలు వ‌చ్చినా ఆద‌రించ‌లేదు. అయితే ఓటీటీలో మాత్రం హిట్. నెట్ ఫ్లిక్స్‌లో ప్ర‌ద‌ర్శితం అవుతున్న వైల్డ్ డాగ్ కి మంచి స్పంద‌న వ‌స్తోంది. వ్యూవ‌ర్ షిప్ ప‌రంగా.. సౌత్ ఇండియ‌న్ రికార్డుల్ని వైల్డ్ డాగ్ బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అదే బాట‌లో.. `చావు క‌బురు చ‌ల్ల‌గా` వెళ్తోంది. కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠీ జంట‌గా న‌టించిన సినిమా ఇది.

 

థియేట‌ర్లో ఆడ‌లేదు. క‌నీసం ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఆహాలో ప్ర‌ద‌ర్శితం అవుతోంది. ఓటీటీలో మాత్రం ఈసినిమాని బాగా చూస్తున్నార్ట‌. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకీ రాని వ్యూవ‌ర్ షిప్ ఈ సినిమాకి వ‌చ్చింద‌ని ఆహా టీమ్ చెబుతోంది. అయితే ఆహా కోసం ఈ సినిమాని మ‌రోసారి ఎడిట్ చేశారు. కొన్ని స‌న్నివేశాల్ని తొల‌గించారు. దాంతో.. సినిమాలో వేగం పెరిగింది. పైగా.. ఇంటి ప‌ట్టున కూర్చుని చూడ్డానికి ఇలాంటి సినిమాలు బాగానే ఉంటాయి. అందుకే ఓటీటీలో ఈ సినిమాకి ఆద‌ర‌ణ వ‌స్తోంది.

ALSO READ: కోవిడ్ కి చెక్ పెట్టిన ల‌వ్ స్టోరీ