ENGLISH

అది నాకు ఎప్పట్టికీ తీరని లోటు: చిరంజీవి

10 June 2017-19:38 PM

దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాప సభ కొద్దిసేపటి క్రితం జరిగింది. దీనికి యావత్ సినీపరిశ్రమ తరలి వచ్చింది.

ఇక ఈ సంతాప సభకి హాజరయిన చిరంజీవి మాట్లాడుతూ- ఆయన చనిపోయినప్పుడు విదేశాల్లో ఉండడం వల్ల ఆయన కడసారి చూపుకి అదృష్టం లేకుండాపోయింది అని భాధపడ్డారు. అలా ఆఖరుగా ఆయనని చూడలేకపోవడం అనేది తనకి ఎప్పటికి తీరని లోటు అని ఉద్వేగంగా చెప్పారు.

ఆయనతో గల సాన్నిహిత్యం ఎప్పటికి గుర్తుంటుంది అని అలాగే దాసరి గారితో చివరి సారిగా గడిపిన క్షణాలని వివరిస్తూ ఆ జ్ఞాపకాలు ఎప్పటికి తన మదిలో శాశ్వతంగా ఉంటాయి అని తెలిపారు.

చిరుతో పాటు మిగిలిన చలనచిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఆయనకి తమకి ఉన్న అనుబంధం గురించి నెమరువేసుకున్నారు.

 

ALSO READ: కూతురుగా నటించి ఇప్పుడు భార్యగా నటిస్తుందా?