ENGLISH

కేథరీన్‌ వెర్సస్‌ కాజల్‌ అగర్వాల్‌

10 June 2017-18:15 PM

బొద్దుగుమ్మ కేథరీన్‌, చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఎందుకంటారా? రానా కోసం. రానా నా వాడంటే. నా వాడంటూ ఈ ముద్దుగుమ్మలిద్దరూ గొడవ పెట్టుకుంటున్నారట. ఇదంతా ఎందుకంటారా? తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నేనే రాజు నేనే మంత్రి అంటూ డైలాగ్‌ చెప్తూ రానా తన క్యారెక్టర్‌ని పరిచయం చేసుకున్నాడు. అలాగే తాజాగా మరో పోస్టర్‌ విడుదలైంది. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు తమ తమ క్యారెక్టర్స్‌ని పరిచయం చేసుకున్నారు ఎలాగంటారా? అదేనండీ, రానా నేనే రాజు నేనే మంత్రి అంటుంటే..అందుకు ఈ ముద్దుగుమ్మల్లో కాజల్‌ భామ 'నేనే రాధ నేనే భార్య' అంటూ చెబుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌, ' కాదు నేనే రాణి నేనే భార్య ..' అంటూ కేథరీన్‌ ఉన్న మరో పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌ సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. చాలా కొత్తగా ఉన్నాయి ఈ పోస్టర్స్‌. రానా చెవికి బంగారు పోగుతో కళ్లకి బ్లాక్‌ గాగుల్స్‌తో మెరిసిపోతున్నాడు. కాజల్‌ ట్రెడిషనల్‌ లుక్‌లోనూ, కేథరీన్‌ మోడ్రన్‌ అండ్‌ అఫీషియల్‌ లుక్‌లోనూ దర్శనమిస్తున్నారు. మొత్తానికి ఈ పోస్టర్స్‌ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. అసలింతకీ ఈ సినిమాలో రాణి ఎవరు ? అనేది ఫ్యాన్స్‌ ప్రశ్న. అది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్‌ చేయాల్సిందే. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: కూతురుగా నటించి ఇప్పుడు భార్యగా నటిస్తుందా?