ENGLISH

గేమ్ చేంజర్ పై చిరు రివ్యూ

30 December 2024-16:30 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ కానున్న సందర్భంగా విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటుచేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఇదే భారీ కటౌట్ అని మెగా ఫాన్స్ చెప్తున్నారు. 256 అడుగుల కటౌట్ ని వారం రోజులు శ్రమించి ఏర్పాటు చేసారు. 256 అడుగుల ఎత్తు కటౌట్ తో రికార్డ్ క్రియేట్ చేసిన ఫాన్స్ ని అభినందిస్తూ దిల్ రాజు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ పై చిరు రివ్యూ ఏంటో తెలిపారు.

విజయవాడ లో రామ్ చరణ్ కటౌట్ ఓపెనింగ్ కి వచ్చిన దిల్ రాజు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే ముందు చిరంజీవి గారికి ఫోన్ చేశాను. ఇంతకముందు చిరు కొంత సినిమా చూసారు. ఇప్పుడు  పూర్తి సినిమా చూడమని కోరగా సరే అని మూవీ చూడటం ప్రారంభించారని, తనకు విజయవాడ వచ్చేసరికి చిరంజీవి ఫోన్ చేసి 'ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పండి' అని చిరు నాతో చెప్పారని దిల్ రాజు తెలిపారు. అంతే కాదు మెగా పవర్ స్టార్‌' లో 'మెగా'ని, అలాగే 'పవర్‌'ని కూడా గేమ్ చేంజర్ లో చూస్తారని చిరు తెలిపినట్లు చెప్పాడు.

​నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు కలిగిన ఫీలింగే ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన రివ్యూ వలన కూడా వచ్చింది అని దిల్ రాజు తెలిపారు. జనవరి 10న మెగా ఫాన్స్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారని భరోసా ఇచ్చారు. గేమ్ చేంజర్ లో చెర్రీ మూడు డిఫరెంట్  షేడ్స్ లో కనిపిస్తాడని, ఐఏఎస్ అధికారిగా, పోలీస్ అధికారిగా, పొలిటీషన్ గా కూడా కనిపిస్తాడని రివీల్ చేసాడు దిల్ రాజు. గేమ్ చేంజెర్ మూవీలో కచ్చితంగా శంకర్ మార్క్ ఉంటుంది అని హైపు పెంచాడు. మూవీ నిడివి రెండు గంటల 45 నిమిషాలు అని స్పష్టం చేసాడు దిల్ రాజు. మొత్తానికి చిరు రివ్యూతో గేమ్ చేంజెర్ పై అంచనాలు పీక్స్ కి చేరాయి.

ALSO READ: డ్రింకర్ సాయి దర్శకుడు పై మంతెన ఫాన్స్ దాడి