ENGLISH

గేమ్ చేంజర్ కి హెల్ప్ అవుతున్న RRR

31 December 2024-13:00 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' మూవీతో సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. రెండు తెలుగురాష్ట్రాల్లో ఈవెంట్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈవెంట్స్ జరుపనున్నారు. చరణ్ నుంచి RRR తరువాత ఇంకో మూవీ రాలేదు. అంటే చెర్రీని థియేటర్స్ లో చూసి మూడేళ్లు అవుతోంది. ఇన్నాళ్ళకి గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. కరక్ట్ గా ఇదే టైం లో గేమ్ చేంజర్ రిలీజ్ ముందు RRR డాక్యుమెంటరీ రావటం చెర్రీకి బిగ్ రిలీఫ్ గా ఉంది.

రీసెంట్ గా 'RRR బిహైండ్ అండ్ బియాండ్' అని ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసారు జక్కన్న. ఇది మొదట థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. RRR మూవీ ఎక్సపీరియన్స్, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చిట్ చాట్, మేకింగ్‌ సీన్స్‌, యాక్షన్ సీన్స్, నుంచి ఆస్కార్‌  వరకు RRR జర్నీ ఈ డాక్యుమెంటరీ లో చిత్రించారు జక్కన్న. ఇందులో రామ్ రాజు పాత్రలో చెర్రీ నట విశ్వ రూపం, స్టైల్, లుక్ అన్నీ దేశ విదేశాల్లో చర్చిస్తూ,రామ రాజు పాత్ర పై ఇష్టం పెంచుకుంటున్నారు సినీప్రియులు. ఇదే ఇప్పడు గేమ్‌ ఛేంజర్‌ కి ప్లస్ అయ్యింది.

గేమ్ చేంజర్ రిలీజ్ ముందు ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కావడం వల్ల చెర్రీ రాబోయే మూవీకి ఎక్సట్రా ప్రమోషన్ లభించింది. సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. గేమ్‌ ఛేంజర్‌ కోసం మూవీ యూనిట్ తో పాటు ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున  ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి RRR లో అల్లూరి సీతారామరాజు పబ్లిసిటీ కూడా యాడ్ అయ్యింది.

ALSO READ: గేమ్ చేంజర్ పై చిరు రివ్యూ