ENGLISH

త‌ప్పుకోండి.. 'గాడ్ ఫాద‌ర్‌' వ‌స్తున్నాడు

07 April 2022-15:01 PM

ఈనెల‌లోనే `ఆచార్య‌` వ‌స్తోంది. చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. గ‌తేడాది విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈయేడాది ఫిబ్ర‌వ‌రి 4న తీసుకొస్తామ‌ని చెప్పినా కుద‌ర్లేదు. ఈనెలాఖ‌రున మాత్రం విడుద‌ల ఖాయ‌మైంది. అయితే.. ఈ యేడాదిలోనే చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` కూడా వ‌చ్చేస్తోంది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన `లూసీఫ‌ర్‌`కి ఇది రీమేక్‌. ఇప్ప‌టికే మూడొంతుల చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. రిలీజ్ డేట్ విష‌యంలో కూడా ఓ క్లారిటీకి వ‌చ్చేశారు. ఆగ‌స్టు 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాలీవుడ్ టాక్‌. ఆగ‌స్టు 11 చాలా కీల‌క‌మైన డేట్. ఎందుకంటే... వ‌రుస‌గా సెల‌వ‌లు వ‌స్తున్నాయి. బాక్సాఫీసు ద‌గ్గర వ‌సూళ్లు కుమ్ముకునే ఛాన్సుంది. అందుకే ఈ డేట్ పై చిరు గురి పెట్టాడు.

 

అయితే... అదే రోజున‌చాలా సినిమాలు వ‌స్తున్నాయి. అఖిల్ ‘ఏజెంట్’, సమంత ‘యశోద’, అమీర్ ఖాన్ ‘లాల్‌సింగ్ ఛద్దా’ విడుదల కాబోతున్నాయి. అమీర్ ఖాన్‌ది పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. రిలీజ్ డేట్ మారే ప్ర‌సక్తే లేదు. కాక‌పోతే... అఖిల్, స‌మంత సినిమాలు మాత్రం మ‌రో డేట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఇది చిరంజీవి సినిమా. దాంతో పోటీ... చాలా ప్ర‌మాదం.

ALSO READ: పుష్ప‌.. పుష్ప‌రాజ్‌.. ప‌రీక్ష రాసేదేలే...!