ENGLISH

పుష్ప‌.. పుష్ప‌రాజ్‌.. ప‌రీక్ష రాసేదేలే...!

07 April 2022-13:00 PM

సినిమాల ప్ర‌భావం స‌మాజంపై చాలా ఉంటుంది. యువ‌త‌రంపై మ‌రింత ఉంటుంది. స్టార్ హీరోలు, వాళ్ల మేన‌రిజాలు, డైలాగుల్ని.. యువ‌త ప‌ట్టేస్తుంది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడేస్తుంది. పుష్ప‌..పై మీమ్స్‌, రీల్స్‌.. ఎన్నొచ్చాయో.? త‌గ్గేదేలే.. అంటూ బ‌న్నీచేసిన మేన‌రిజాన్ని క్రికెట‌ర్లు కూడా అనుక‌రించారు. `త‌గ్గేదేలే..`అనేది ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఇది ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఓ కుర్రాడు.. స‌మాధానాల‌కు బ‌దులు.. ఈ డైలాగ్ రాసేశాడు. దాంతో ప‌రీక్ష పేప‌ర్లు దిద్దిన ఉపాధ్యాయుడు అవాక్క‌డ‌య్యాడు. ఇది ఇక్క‌డ జ‌రిగిన సంగ‌తి కాదు. ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రిగింది.

 

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి ఆన్సర్‌ పేపర్‌లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. సమాధానాలకు బదులుగా పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ``పుష్ప‌.. పుష్ప‌రాజ్‌.. అపున్ లిఖేంకే న‌హీ సాలా..`` అంటూ.. హిందీ డైలాగ్ దించేశాడు. ఇది చూసి న‌వ్వాలో ఏడ్వాలో అర్థం కాని ప‌రిస్థితి. సినిమాలు చూడ‌డం ఎంజాయ్ చేయ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ.. ఆ పైత్యం ముదిరిపోతే.. జీవితాలు నాశ‌నం అయిపోతాయి. ఈ విష‌యాన్ని ఈత‌రం గుర్తించుకుంటే మంచిది.

ALSO READ: ‘అంటే.. సుందరానికి’ చిత్ర యూనిట్ ‘పంచెకట్టు థీమ్ పార్టీ’