ENGLISH

జగన్ అప్పాయింట్ మెంట్ దొరికింది

08 February 2022-18:30 PM

ఇటీవ‌ల చిరంజీవి -జ‌గ‌న్‌ల మ‌ధ్య భేటీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చిరు ఒక్క‌డికే ఆహ్వానం రావ‌డంతో ఆ భేటీ .. వ్య‌క్తిగ‌త స‌మావేశంగా మారిపోయింది. అందుకే ఈసారి టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో స‌మావేశం అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు జ‌గ‌న్‌. అందుకే మ‌రోసారి అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఈనెల 10న జ‌రిగే స‌మావేశంలో పాల్గొన‌మ‌ని టాలీవుడ్ కి పిలుపువ‌చ్చింది. చిరంజీవితో స‌హా నాగార్జున‌, రాజ‌మౌళి, దాన‌య్య‌, దిల్ రాజు త‌దిత‌రులు ఈ మీటింగ్ లో పాలుపంచుకోబోతున్నారు. ప‌దిమందికి మించ‌కుండా ఈసారి ఓ బృందం.. జ‌గ‌న్ ని క‌ల‌వ‌బోతోంది. ఆ ప‌దిమంది ఎవ‌రన్న‌ది రేప‌టిలోగా నిర్దార‌ణ‌కు వ‌స్తుంది.

 

ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సిన కీల‌క‌మైన స‌మావేశం వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. బ‌హుశా.. బుధ‌వారం ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ స‌మావేశం జ‌ర‌గాలి. లేదంటే. సీఎంని క‌లిసిన త‌ర‌వా.. అక్క‌డ ఏమేం విష‌యాలు మాట్లాడుకున్నారో చెప్ప‌డానికైనా ఓ స‌మావేశం అత్య‌వ‌స‌రం. మ‌రి ఈ మీటింగ్ రేపు ఉంటుందా, లేదా? .జ‌గ‌న్‌ని క‌లిశాక ఉంటుందా? అనేది తెలియాల్సివుంది.

ALSO READ: ప‌వ‌న్ కోసం మ‌రోసారి 'పెన్ను'సాయం