ENGLISH

ప‌వ‌న్ కోసం మ‌రోసారి 'పెన్ను'సాయం

08 February 2022-12:23 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్‌ల‌ది అల్టిమేట్‌.. కాంబో. జ‌ల్సా.. అత్తారింటికి దారేది సూప‌ర్ హిట్లయ్యాయి. అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అయినా, ఈ కాంబోపై క్రేజ్ త‌గ్గ‌లేదు. భీమ్లా నాయ‌క్ కోసం .. త్రివిక్ర‌మ్ పెన్ సాయం చేశారు. ఈ సినిమాకి స్క్రిప్టు మొత్తం తానే ఇచ్చి, వ్య‌వ‌హారం అంతా వెన‌కుండి చూసుకున్నారు. ఈ సినిమాకి సాగ‌ర్ చంద్ర అనే దర్శ‌కుడు ప‌నిచేసినా, ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ సినిమాలానే చ‌లామ‌ణీ అవుతోంది. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ సినిమాని `పెన్‌` సాయం చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్‌.

 

త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన `వినోదాయ శితం` చిత్రాన్ని తెలుగులో పవ‌న్ రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా రైట్స్ జీ సంస్థ ద‌గ్గ‌ర ఉన్నాయి. వాళ్లేమో.. ఈ సినిమాని త్రివిక్ర‌మ్ చేస్తేనే, తెలుగులో రీమేక్ చేస్తాం అంటున్నారు. ప‌వ‌న్ కూడా త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తే, తెలుగులో చేయాల‌నుకుంటున్నాడ‌. సో.. భీమ్లా నాయ‌క్‌లానే, ఈ వినోదాయ శితం రీమేక్ ని కూడా త్రివిక్ర‌మ్ వెనుకుండి న‌డిపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌. అదే జ‌రిగితే.. మ‌రో క్రేజీ కాంబో సెట్ట‌యిన‌ట్టే.

ALSO READ: తిరుప‌తిలో మోహ‌న్‌బాబు ఫిల్మ్ అకాడ‌మీ