ENGLISH

మెగా మూవీకి ఈ కొత్త కన్ఫ్యూషన్ ఏంటి?

07 June 2017-17:27 PM

చిరంజీవి 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆగష్టులో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందనే విషయాన్ని సినిమా నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ స్వయంగా తెలిపారు. అయితే తాజాగా చిరంజీవి సినిమా విషయంలో ఓ కొత్త గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా కన్నా ముందుగానే ఓ కమర్షియల్‌ సినిమా చేయాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చారట. ఇది చారిత్రాత్మక చిత్రం. కావునా దీని కోసం చరిత్రని ఎంత తవ్వినా ఇంకా ఇంకా బయటికి వస్తూనే ఉంది. అందుకే మరికొంత టైం తీసుకోనుందట చిత్ర యూనిట్‌ ఈ సినిమా కోసం. అయితే ఈ సినిమా షెడ్యూల్‌ మాత్రం అనుకున్న టైం ప్రకారమే ఉండనుందట. కానీ ఈ లోగానే ఓ కమర్షియల్‌ చిత్రం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చే యోచనలో చిరంజీవి ఉన్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఫ్యాన్స్‌కి అంతకన్నా కావాల్సిందేముంది. చిరంజీవి నుండి ఈ పాటికే అలాంటిది ఫ్యాన్స్‌ కోరుకున్నారు. అయితే చిరు 150వ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నారు. అయినా కానీ బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో ద్వారా చిరు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నప్పటికీ, బిగ్‌ స్క్రీన్‌పై మెగాస్టార్‌ని చూడాలన్న ఫ్యాన్స్‌ కోరికకు హద్దులుండవు కదా. ఏదేమైనా చిరు యోచన మంచిదే. ఈ సినిమాని అతి త్వరగా కంప్లీట్‌ చేసి, విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాని డైరెక్ట్‌ చేసేది ఎవరనేది ఇంకా సస్పెన్స్‌. ఈ రూమర్‌ నిజమైతే వివరాలు త్వరలోనే తేలనున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. 

 

ALSO READ: లక్‌ అంతా ఆ బ్యూటీస్‌దేనా?