ENGLISH

చిత్రలేఖలో ఈ యాంగిల్‌ కూడా ఉందా?

07 October 2017-16:32 PM

చిత్రలేఖ తొలుత యాంకర్‌గా మాత్రమే పరిచయం బుల్లితెర ప్రేక్షకులకు. తర్వాత వెండితెరపైనా అడుగు పెట్టింది. నటిగా పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదు, చిత్రలేఖ మంచి డాన్సర్‌ కూడా. గలగలా మాట్లాడడం యాంకర్‌గా ఉండాల్సిన ప్రథమ లక్షణం. కానీ చకచకా చక్కని కవితలు రాయడం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే ఉండే అరుదైన లక్షణం. ఆ అరుదైన యాంగిల్‌ చిత్ర లేఖలో ఉందన్న సంగతి చాలా లేట్‌గా వెలుగులోకి వచ్చింది. చిత్రలేఖ మల్టీ టాలెంటెడ్‌ అన్న సంగతి చాలా సార్లే ప్రూవ్‌ అయ్యింది. అయితే ఒక రచయిత్రిగా కవితలు రాసింది అంటే ఆమెను మెచ్చుకుని తీరాల్సిందే. ఏదో టైం పాస్‌కి కవితలు రాయం కాదండోయ్‌. చిత్రలేఖ రాసిన కవితలన్నీ ఓ బుక్‌లా రిలీజ్‌ చేసేసింది. ఘనంగా ఆ బుక్‌ రిలీజ్‌ ఉత్సవం జరిగింది. ఆ వేడుకకి ప్రముఖ రచయిత, నటుడు అయిన తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని చిత్రలేఖని ఆశీర్వదించారు. రాసిన కవితలు చాలా బాగున్నాయంటూ ఆమెని ప్రశంసించారు. కేవలం నటిగా, యాంకర్‌గా, డాన్సర్‌గానే కాకుండా, చిత్రలేఖ మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటోంది. ఇన్ని వ్యవహారాలు చక్కబెడుతూనే, ఓ మంచి గృహిణిగానూ పేరు తెచ్చుకుంటోంది చిత్రలేఖ. చిత్రలేఖ వంటి వారిని ప్రోత్సహిస్తే మరింత ఎక్స్‌ట్రా టాలెంట్‌ని బయటికి తీసుకురావచ్చు. హ్యాట్సాప్‌ చిత్రలేఖ!

ALSO READ: దగ్గుబాటి సురేష్‌ సూపర్‌ మాస్‌ గురూ!