ENGLISH

దగ్గుబాటి సురేష్‌ సూపర్‌ మాస్‌ గురూ!

07 October 2017-15:53 PM

దగ్గుబాటి సురేష్‌బాబు అంటే ప్రముఖ నిర్మాతగానే తెలుసు. తెర వెనుక ఉండి తెరపై నటీనటులను ఆడించడానికి అవసరమైన సదుపాయాలు అన్నింటినీ సమకూరుస్తారు నిర్మాతగా ఆయన. కానీ ఆయన స్టేజ్‌ ఎక్కి చిందేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సూపర్‌ మాసే మాస్‌. అదేంటి ఆయన ఎప్పుడు స్టేజ్‌పై డాన్స్‌ వేయాలి అనుకుంటున్నారా? వేశారు. ఎక్కడ అనుకుంటున్నారా? శుక్రవారం గోవాలో నాగచైతన్య, సమంతల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగీత్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అందరూ డాన్స్‌ చేయగా, అందులో సురేష్‌బాబు డాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. సురేష్‌బాబు సమంతతో కలిసి చిందేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. పెళ్లి కూతురు గెటప్‌లో సమంత, పంచె కట్టులో సురేష్‌బాబు డాన్స్‌ చూసి అభిమానులు అదరహో అంటూ ఆ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. సురేష్‌బాబు ఎనర్జిటిక్‌ డాన్స్‌ చేస్తుంటే, ఆ ఎనర్జీకి దగ్గుబాటి ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పెళ్లికొడుకు గెటప్‌లో చైతూ, పక్కనే వెంకటేష్‌, ఉన్న ఫోటోను నాగార్జున ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మేనల్లుడిని పెళ్లి కొడుకు గెటప్‌లో చూసి వెంకటేష్‌ మురిసిపోయారు. అప్పుడు చైతూ ఎంత పెద్దవాడయ్యాడో అంటూ ఆనందపడ్డారు. శుక్రవారం సాయంత్రం హిందూ సాంప్రదాయంలో చైతూ, సమంత ఒక్కటయ్యారు. ఈ రోజు అనగా శనివారం సాయంత్రం క్రిస్టియన్‌ సాంప్రదాయంలో సమంత, చైతూ వివాహం జరగనుంది.

ALSO READ: ఆ గొంతు ఇద్దరినీ కలిపింది