ENGLISH

ఆ గొంతు ఇద్దరినీ కలిపింది

07 October 2017-15:50 PM

తెరపై కనిపించేది ఓ ముద్దుగుమ్మ. కానీ వినిపించేది మాత్రం మరో ముద్దుగుమ్మ. అసలింతకీ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరనుకుంటున్నారా? కనిపించే ఆ ఒకరు సమంత అయితే, వినిపించే గొంతు చిన్మయిది. ఈమె సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. సమంతకు ఈ ముద్దుగుమ్మే వాయిస్‌ ఇస్తుందన్న సంగతి తెలిసిన విషయమే. అచ్చు సమంతే మాట్లాడుతోందన్నట్లనిపిస్తుంది చిన్మయి వాయిస్‌. ఈ ఇద్దరి అనుబంధం అలాంటిది. తొలి సినిమా 'ఏ మాయ చేశావె' దగ్గర్నుంచీ చిన్మయి వరుసగా సమంతకు వాయిస్‌ అందిస్తూనే ఉంది. అలా చిన్మయి వాయిస్‌ సమంతపై ప్రేక్షకులకు మరింత అభిమానం పెంచుకొనేలా చేసింది. తొలి సినిమాలో సమంత అంత మాయ చేయడంలో వాయిస్‌ ఇచ్చిన చిన్మయి పాత్ర కూడా లేకపోలేదు. ఆ స్వీట్‌ వాయిస్‌కే పడిపోయారు ప్రేక్షకులు. అలా తొలి సినిమా నుండీ సమంతకి, చిన్మయితో క్లోజ్‌ ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది ఆ రకంగా. ఆన్‌ స్క్రీనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌ కూడా ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకే సమంత పెళ్లికి అతిధులు కొంతమందే. కేవలం 100 మందే. ఆ వంద మంది అతి ముఖ్యమైన అతిధుల్లో చిన్మయి దంపతులు కూడా ఉన్నారు. చిన్మయి యంగ్‌ హీరో రాహుల్‌ భార్య. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు రాహుల్‌. పెళ్లి సందర్భంగా గోవాలో రాహుల్‌, చిన్మయి దంపతులతో సమంత ఆప్యాయంగా దిగిన ఫోటోనీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సమంత లేటెస్ట్‌ మూవీ అయిన 'రాజుగారి గది - 2'లో సమంత పాత్రకి డబ్బింగ్‌ చెప్పేటప్పుడు, చాలా ఎమోషనల్‌ ఫీలయిందట. దుఃఖం ఆపుకోలేకపోయిందట. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది చిన్మయి. అదీ సమంత - చిన్మయి అనుబంధం!

ALSO READ: త‌మిళ హీరోకి అరెస్టు వారెంటు