ENGLISH

దయాగుణం చాటుకున్న కామెడీ హీరో

05 October 2017-14:42 PM

సినిమాల్లో కామెడీ సీన్స్‌నే కాదు, ఎమోషనల్‌ సీన్స్‌ని పండించడంలోనూ కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌ మంచి టాలెంట్‌ ఉన్నోడు. తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అలాగే తెలుగ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇటీవలే 'ఉంగరాల రాంబాబు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సునీల్‌. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మియా జార్జ్‌ హీరోయిన్‌గా నటించింది. సరే ఇదంతా రీల్‌ సంగతి. రియల్‌గానూ సునీల్‌ హీరోనే. తనకున్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి ఖర్చుపెట్టాలనే యోచనలో ఉంటాడు సునీల్‌. అందుకే సినిమాలో నవ్వులు పండించడమే కాదు, అనాధ పిల్లల ముఖంలో రియల్‌ ఆనందాన్ని చూడాలనుకున్నాడు. 20 మంది అనాధ పిల్లలను ఫిల్మ్‌ సిటీకి తీసుకెళ్లి నచ్చిన ఆటపాటలు ఆడించి వారి కళ్లలో ఆనందాన్ని చూసి పొంగిపోయాడు. తన దయా గుణాన్ని చాటుకున్నాడు. హీరోలంటే తెరపై కనిపించి ఎంటర్‌టైన్‌ చేసేవాళ్లే కాదనీ, తమ వద్దకూ వస్తారనీ, ఆనందం పంచుతారనీ సునీల్‌ నిరూపించాడు. సునీల్‌ అంటే తమకు బాగా ఇష్టమనీ, ఆయనతో రియల్‌గా ఇలా ఆనందంగా గడపడం తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని పిల్లలు తెలిపారు. అలాగే పిల్లలంటే తనకెంతో ఇష్టమనీ, నిర్మలమైన, స్వచ్ఛమైన మనసున్న పిల్లలతో ఇలా గడిపినందుకు తనకెంతో సంతోషంగా ఉందని సునీల్‌ తెలిపారు.

ALSO READ: సినీ వెబ్‌సైట్స్‌ అశ్లీలతపై వేటు పడింది