ENGLISH

టీజర్ టాక్ : యుద్ధానికి దిగిన చైతు

16 March 2023-17:26 PM

నాగ చైతన్య, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పోలీస్ కథ చేస్తున్నాడు. అదే కస్టడీ. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. నాగచైతన్య వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైయింది.

 

‘’గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’అంటూ సాగింది ఓవర్ ఓవర్.

 

చైతు పోలీస్ పాత్రలో కొత్తగా సీరియస్ గా కనిపించాడు.కృతి శెట్టికి టీజర్ లో పెద్దగా చోటు లేదు. అరవింద్ స్వామీ విలనీ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. కెమరాపనితనం, నేపధ్య సంగీతం రిచ్ గా వున్నాయి. వెంకట్ ప్రభు కథ గురించి టీజర్ లో పెద్దగా చెప్పలేదు. యాక్షన్ మాత్రం హైలెట్ గా నిలిచింది.ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.