ENGLISH

Nani: నాని వంద కోట్ల హీరో అయిపోయిన‌ట్టే!

17 March 2023-09:06 AM

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన ద‌స‌రా ఈనెల 30న విడుద‌ల కానుంది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంతో శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింద‌ని టాక్‌. నాని కెరీర్ లోనే హయ్య‌స్ట్ బిజినెస్ ద‌స‌రాకేన‌ట‌. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలు, నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ క‌లిపి.. దాదాపుగా రూ.75 కోట్ల వ్యాపారం జ‌రిగింద‌ని తెలుస్తోంది.

 

నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే రూ.50 కోట్లు వ‌చ్చాయ‌ట‌. ఏపీ, తెలంగాణ క‌లిపి థియేట‌ర్ల నుంచి రూ.30 కోట్లు తెచ్చుకొంటే చాలు. బ‌య్య‌ర్లు గ‌ట్టెక్కేస్తారు. అయితే నార్త్ మొత్తం నిర్మాత ఓన్ రిస్క్‌తో విడుద‌ల చేస్తున్నాడు. నార్త్ లో మాస్ సినిమాల‌కుఆద‌ర‌ణ బాగుంటోంది. ముఖ్యంగా.. తెలుగు సినిమాల‌కు ఇప్పుడు అక్క‌డ గిరాకీ బాగుంది. ద‌సరాకి వ‌చ్చిన బ‌జ్ చూస్తే... క‌చ్చితంగా నార్త్ లో కూడా గిట్టుబాటు అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.అక్క‌డ ఏమాత్రం క్లిక్ అయినా.. క‌నీసం 20 కోట్లు తెచ్చుకోవ‌డం ఖాయం. మొత్తం క‌లిపితే.. నాని 100 కోట్ల హీరో అయిపోయిన‌ట్టే.