ENGLISH

'దంగల్‌' 999 కోట్లు

01 June 2017-18:18 PM

అమీర్‌ ఖాన్‌ నటించిన 'దంగల్‌' సినిమా చైనాలో సాధించిన క్రెడిట్‌కి యావత్‌ ఇండియన్‌ సినిమా గర్వపడుతోంది. అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రెజ్లింగ్‌ కథాంశంగా తెరకెక్కిన సినిమా ఇది. చైనా ప్రేక్షకుల్ని ఆధ్యంతం ఆకట్టుకుంటోంది ఈ సినిమా. ఏకంగా అక్కడ 1000కోట్లు వసూళ్లని సొంతం చేసేసుకుంది. నిన్నటికి 992.05 కోట్లు వసూళ్లు సాధించగా, ఈ రోజు 1000 కోట్లు దాటేసింది. ఈ ఫీట్‌ సాధించిన తొలి భారతీయ సినిమా ఇది. 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తొలి స్థానంలో ఉంది. అయితే 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' విడుదలయ్యాక ఆ ప్లేస్‌ని దక్కించేసుకుంది. అయితే చైనాలో 'దంగల్‌' విడుదలయ్యాక ఆ ప్లేస్‌ని మళ్లీ సొంతం చేసేసుకుంది. ఇప్పుడు యూనివర్సల్‌లో 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'ని దాటేసి, 'దంగల్‌' సినిమా ది నెంబర్‌ వన్‌ ఫీట్‌ సాధించింది. దేశ దేశాల 'దంగల్‌'ని కీర్తించని వారే లేరు. అమీర్‌ ఖాన్‌ చేసిన ఈ ప్రయోగం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇండియన్‌ సినిమా సత్తాని చాటింది. మరో పక్క 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' కూడా చైనాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా చైనాలో విడుదలయితే ఏ రకమైన రికార్డుల్ని సాధిస్తుందో చూడాలి మరి. వాస్తవానికి 'బాహుబలి ది బిగినింగ్‌'కి అంతగా ఆదరణ దక్కలేదు. దాంతో చైనాలో 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' విడుదలపై అంతగా ఆశక్తి చూపలేదు. కానీ అక్కడ ఓ ఇండియన్‌ సినిమాగా 'దంగల్‌' సాధించిన కీర్తితో అక్కడ 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: బుల్లితెరపై భళ్ళాలదేవుడు