ENGLISH

దాసరి మరణంపై అనుమానాలు ఉన్నాయట!

01 June 2017-14:58 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక పెద్దన్నలా ఉన్న దాసరి నారాయణరావు గారి ఆకస్మిక మరణం ఇండస్ట్రీలో అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి లోకి నెట్టింది.

అయితే ఆయన అకాలమరణం పై తనకి అనుమానాలు ఉన్నాయంటూ దాసరి పెద్ద కోడలు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయన మరణం పై అందరికి అనుమానాలు మొదలయ్యాయి.

ఆరోగ్యంగా ఉండే దాసరి గారికి ఇలా అవ్వడమేంటి అని ఆశ్చర్యపోయిన వారు లేకపోలేదు. అయితే ఆయన తన శరీర బరువుని తగ్గించే ప్రయత్నంలో చేసిన ఓ సర్జరీ సందర్భంగా తలెత్తిన సమస్యలే ఇలా ఆయన ఆరోగ్యం క్షీణించడానికి తోడ్పడ్డాయి అని అంటున్న వారు ఉన్నారు.

ఇటువంటి సమయంలో ఆయన కోడలు చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అనుమానాలను ఎటు వైపు తిప్పుతాయో చూడాలి.

 

ALSO READ: Mahesh Spyder Teaser Talk