ENGLISH

సీనియర్ నటుడు చనిపోయారు అంటూ తప్పుడు వార్తలు

13 March 2018-12:03 PM

సోషల్ మీడియాలో వార్తలు ఈమధ్యకాలంలో పరిధులు దాటడమే చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టుల ఆరోగ్య స్థితిగతుల పైన ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం చాలా ఎక్కువైంది. కొంతమంది నటీనటులు ఇలాంటి వార్తల పైన స్పందించడం తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది. 

తాజాగా నిన్న ఒక సీనియర్ యాక్టర్ అయిన వంకాయల సత్యనారాయణ మూర్తి స్వర్గస్థులైనారు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది చనిపోయింది మరొక సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంటూ కథనాలు అలాగే ఆయన ఫోటోలు కూడా వేసేశారు. 

దీనితో ఆయన సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా తప్పుడు వార్తలు బయటకి రావడం పట్ల అందరు తీవ్రంగా గర్హిస్తున్నారు. 

ఇప్పటికైనా సోషల్ మీడియాలో వార్తలు రాసేవారు ఒకింత జాగ్రతగా ఒకటికి పదిసార్లు సరిచూసుకుని వార్తలు రాస్తే మంచిది అని అందరు సూచిస్తున్నారు.

 

ALSO READ: అర్జున్ రెడ్డి లవర్ గా టాప్ హీరోయిన్ కూతురు..