ENGLISH

Dil Raju, PS 1: దిల్ రాజు చీప్ గా కొట్టేశాడే!

27 September 2022-10:22 AM

మ‌ణిర‌త్నం క‌ల‌ల ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్‌. ఈనెల 30న వ‌స్తోంది. ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు పెట్టారు. తమిళ నాట రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. ఈసినిమా తెలుగు హ‌క్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. తెలుగు రైట్స్ రూపంలో.. చిత్ర‌బృందానికి చెల్లించింది ఎంతో తెలుసా..? అక్ష‌రాలా.. రూ.10 కోట్లు. ఓ డ‌బ్బింగ్ సినిమాకి రూ.10 కోట్లు ఎక్కువే. కాక‌పోతే.. ఇది మ‌ణిర‌త్నం సినిమా. విక్ర‌మ్‌, కార్తి, త్రిష‌, ఐశ్వ‌ర్య‌రాయ్ లాంటి స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. పైగా రెండు భాగాల‌కూ క‌లిపి.. రూ.300 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. అంటే.. తొలి భాగానికి రూ.150 కోట్లు అయ్యింద‌నుకొంటే.. దాన్ని రూ.10 కోట్ల‌కు ద‌క్కించుకొన్నాడు దిల్ రాజు.

 

ఇటీవ‌ల విడుద‌లైన త‌మిళ డ‌బ్బింగ్ `విక్ర‌మ్‌`కి శ్రేష్ట్ మూవీస్ సంస్థ రూ.6 కోట్ల‌కు ద‌క్కించుకొంది. అది రూ.20 కోట్ల వ‌సూళ్లు సాధించింది. అదే మ్యాజిక్‌... మ‌ణిర‌త్నం సినిమాకీ రిపీట్ అయితే ఈ సినిమా నుంచి ఏకంగా రూ.10 కోట్ల లాభం పొందొచ్చు. మ‌ణిర‌త్నం సినిమా కాబ‌ట్టి.. ఓపెనింగ్స్ ఎలాగూ బాగుంటాయి. పైగా ఇది ద‌స‌రా సీజ‌న్‌. కాబ‌ట్టి.. దిల్ రాజు పెట్టుబ‌డికి ఢోకా లేన‌ట్టే.

ALSO READ: ఇక ఎన్టీఆర్ వంతు !