ENGLISH

God Father: గాడ్ ఫాద‌ర్‌కి ఇన్ని స‌మ‌స్య‌లా..?!

27 September 2022-10:24 AM

చిరంజీవి సినిమా వ‌స్తోందంటే... ఆ హైప్‌, క్రేజ్‌, బ‌జ్‌... ఎలా ఉండేది..? టికెట్ల కోసం ముందే రిక‌మెండేష‌న్లు మొద‌లైపోయేవి. మిగిలిన సినిమాలు భ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేసేవి. కానీ `గాడ్ ఫాద‌ర్‌`కి ఇవేం జ‌ర‌గ‌డం లేదు. ఈ సినిమాకి అస్స‌లు బ‌జ్ లేదు. పైగా.. పోటీగా మ‌రో రెండు సినిమాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు థియేట‌ర్ల స‌మ‌స్య కూడా వెంటాడుతోంది. నైజాంలో గాడ్ ఫాద‌ర్‌కి కావ‌ల్సిన సంఖ్య‌లో థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌ని టాక్. దానికి కార‌ణం ఏసియ‌న్ సినిమానే.

 

గాడ్ ఫాద‌ర్ తో పాటుగా మ‌రో సినిమా `ది ఘోస్ట్` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏసియ‌న్ సంస్థ నిర్మించింది. వాళ్ల చేతుల్లో నైజాంలోని కొన్ని థియేట‌ర్లు ఉన్నాయి. అవ‌న్నీ... ఎలాగూ ది ఘోస్ట్ కే వెళ్లిపోతాయి. ఇంకొన్ని ధియేట‌ర్ల‌ని కూడా వాళ్లు ఆక్యుపై చేశారు. దాంతో.. గాడ్ ఫాద‌ర్ సినిమాకి థియేట‌ర్ల సమ‌స్య ఎదురైంది. పైగా ఈ వారం మ‌ణిర‌త్నం సినిమా `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` వ‌స్తోంది. ఈ సినిమాని దిల్ రాజు కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే. నైజాం అంటేనే దిల్ రాజు అడ్డా. అక్టోబ‌రు 5న గాడ్ ఫాద‌ర్ వ‌చ్చినా కొన్ని థియేట‌ర్ల‌లో మ‌ణిర‌త్నం సినిమానే ఉంచేస్తారు. అలాక్కూడా చిరు సినిమాకు థియేట‌ర్ల కొర‌త ఎదురు కానుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో చిరు సినిమాల‌కు ఎప్పుడూ రాని స‌మ‌స్య‌లు ఇవి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

ALSO READ: ఇక ఎన్టీఆర్ వంతు !