ENGLISH

మ‌ళ్లీ తండ్రి కాబోతున్న దిల్ రాజు

21 March 2022-13:30 PM

టాలీవుడ్‌లోని అతి పెద్ద నిర్మాత‌ల్లో దిల్ రాజు ఒక‌రు. పంపిణీదారుడిగానూ ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. త‌న సంస్థ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ 49 చిత్రాలొచ్చాయి. 50వ సినిమా... శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. దీనికి రామ్ చ‌ర‌ణ్ హీరో. 50 సినిమాలంటే మామూలు విష‌యం కాదు. అదో మైలు రాయి. ఆ ఆనందంలో ఉన్న దిల్ రాజు కి మ‌రో పండ‌గ లాంటి వార్త‌. ఆయ‌న మ‌రోసారి తండ్రి కాబోతున్నార‌న్న‌ది టాలీవుడ్ స‌మాచారం.

 

త‌న మొద‌టి భార్య చ‌నిపోయిన త‌ర‌వాత‌, దిల్ రాజు మ‌రో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమె త‌ల్లి కాబోతోంది. దిల్ రాజుకి ఓ కుమార్తె. త‌న‌కు పెళ్ల‌యిపోయింది. మ‌న‌వ‌డితో ఆడుకుంటున్న వ‌య‌సులో.. ఇప్పుడు మ‌రోసారి తండ్రి కాబోతున్నారు. అందుకే దిల్ రాజు ఇంట్లో ఇప్పుడు సంబ‌రాలు మిన్నంటాయి.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ లేటెస్ట్‌: ఎన్టీఆర్ ఎంట్రీ ఆల‌స్యం