ENGLISH

ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌మోష‌న్ అంటే ఈ ముగ్గురేనా?

22 March 2022-11:00 AM

ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌మోష‌న్లు ఓ రేంజులో జ‌రుగుతున్నాయి. ఎక్క‌డ చూసినా ఈ సినిమాదే హంగామా. ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్ కూడా దేశ‌మంతా చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే.. ఎక్క‌డ చూసినా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిలే క‌నిపిస్తున్నారు. ఈ ముగ్గురితోనే ఇంట‌ర్వ్యూలు న‌డుస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో వీళ్లే క‌నిపిస్తున్నారు. దాంతో.. ఇవి చూసి జ‌నాల‌కు బోర్ కొట్టేసింది. ఈ సినిమాలో అలియాభ‌ట్ ఉంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ ఉన్నాడు. శ్రియ ఉంది. తెర వెనుక ఈ సినిమా కోసం చాలామంది ప‌నిచేశారు. వాళ్లెవ‌రూ మీడియా ముందుకు రావ‌డం లేదు.

 

అలియా భ‌ట్ అయితే.. ఢిల్లీ ప్ర‌మోష‌న్‌లో మాత్ర‌మే క‌నిపించింది. అలియా ఈ ప్ర‌మోష‌న్ల‌లో క‌నిపించ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. అదేంటంటే.. అలియా ప్ర‌మోష‌న్ల‌కు వ‌స్తే, ఖ‌ర్చు త‌డిసి మోపెడు అవుతోంది. గ‌తంలో ఇలానే ప్ర‌మోష‌న్ల‌కు వ‌చ్చి నిర్మాత‌కు రూ.3 కోట్ల బిల్లు పెట్టింద‌ట‌. ఈసారి తీసుకొచ్చినా అంతే ఖ‌ర్చువుతంది. అందుకే అలియాని లైట్ తీసుకొంది చిత్ర‌బృందం. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ‌లు సైతం ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన‌డానికి ప్ర‌త్యేకంగా పారితోషికం అడిగార‌ని టాక్‌. అందుకే వాళ్లెవ‌రూ లేకుండా ప్ర‌మోష‌న్లు జ‌రిగిపోతున్నాయి.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ లేటెస్ట్‌: ఎన్టీఆర్ ఎంట్రీ ఆల‌స్యం