ENGLISH

Bobby: బాబీ చేతికి మరో బడా ప్రాజెక్ట్ !

27 September 2022-14:38 PM

దర్శకుడు బాబీ ప్రస్తుతం చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో పెద్ద సినిమాని కూడా లైన్ లో పెట్టారని తెలిసింది. బాలకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నారని టాక్ . ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమాతో బిజీగా వున్నారు బాలకృష్ణ. ఇది పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి చిత్రం కోసం రంగంలో దిగుతారు. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

 

కాగా, ఇప్పుడాయన మరో కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీనికి బాబీ దర్శకుడిగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ తో చేస్తున్న సినిమా కనుక హిట్ అయితే బాబీ బాలయ్య కాంబినేషన్ సెట్ కావడం పెద్ద కష్టమేమీ కాదు.

ALSO READ: గాడ్ ఫాద‌ర్‌కి ఇన్ని స‌మ‌స్య‌లా..?!