ENGLISH

Indira Devi: మహేశ్‌బాబుకు మాతృవియోగం

28 September 2022-09:25 AM

సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

 

ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని కుమార్తెలు ఉన్నారు. కొద్దినెలల క్రితమే రమేశ్‌బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబంలో విషాదం నెలకొంది.

 

ఇందిరాదేవి మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

 

ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.

ALSO READ: బాబీ చేతికి మరో బడా ప్రాజెక్ట్ !