వరుసగా నాలుగు హిట్స్ తో కెరీర్ లో మంచి ఊపుమీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నటించనున్నాడు.
అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో, ఇప్పుడు త్రివిక్రమ్ ఈ చిత్రంతో తన సత్తా చాటాల్సి ఉంది. అయితే హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ వల్ల ఫ్లాప్ వస్తుందేమో అని కొందరు అభిమానులు ఆందోళనపడుతున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఎన్టీఆర్ తో గత నాలుగు చిత్రాలు చేసిన దర్శకులకి కూడా తమ ముందు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడం జరిగింది.
అంటే అజ్ఞాతవాసి చిత్రంతో ఫ్లాప్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంతో హిట్ అందుకుంటాడు అని అన్నది వారి అభిప్రాయం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల చిత్రం పైన అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
ALSO READ: పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అందుకే ఆపేశాడు..