ఎంత క్రేజ్ సంపాదించుకుంటోందో అంతే డ్యామేజ్ కూడా మూట కట్టుకుంటోంది 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి. ఎందుకనో మరి తనపై వస్తున్న అనవసరమైన గాసిప్స్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. వరుస సక్సెస్‌లతో సాయి పల్లవికి పొగరు పెరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారానికి తొందరగా అడ్డుకట్ట వేయాలీ బ్యూటీ మరి. కానీ ఎందుకో సైలెంట్‌గా ఉండిపోతోంది. గాసిప్స్ కొన్నిసార్లు సెలబ్రిటీస్‌కి మంచి చేస్తూనే ఉంటాయి. కానీ చాలాసార్లు చెడు చేస్తుంటాయి. అందుకే గాలి గాసిప్స్‌ని అన్ని టైముల్లోనూ లైట్ తీసుకోకూడదు. సక్సెస్ మీద సక్సెస్‌లు కొడుతున్న సాయి పల్లవి ఈ విషయం గమనించాలి మరి. నానితో 'ఎంసీఏ' సినిమా చేసిన టైంలో ఆమెపై వచ్చిన గాసిప్స్ సంగతి తెలిసిందే.
వాటి సంగతి పక్కన పెడితే, నాగశౌర్య విషయంలో వచ్చిన గాసిప్స్ ఆమెని వెంటాడుతూనే ఉన్నాయి. వదిలిపోవట్లేదు. దాంతో నిజంగానే సాయి పల్లవి అలా బిహేవ్ చేస్తోందా? అనే అనుమానాలు ఆమె అభిమానుల్లో తలెత్తుతున్నాయి. సాయి పల్లవితో వచ్చిన గొడవ కారణంగా నాగశౌర్య ఏకంగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి కూడా హాజరుకావడం మానేశాడు. అంటే ఎంత తీవ్ర స్థాయిలో వీరిద్దరి మధ్యా ఆ సైలెంట్ వార్ జరుగుతోందో అనే ఆశక్తి కలుగుతోంది.
అభిమానుల కోసమైనా సాయిపల్లవి ఈ గాసిప్స్‌కి డైరెక్ట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. ఈ సంగతి పక్కన పెడితే, ఈ బ్యూటీ తమిళంలో తొలిసారి నటించిన 'కరు' చిత్రం తెలుగులో 'కణం' పేరుతో విడుదలవుతోంది. ఓ బిడ్డకి తల్లిగా నటించింది సాయి పల్లవి ఈ సినిమాలో. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రస్తుతం, శర్వానంద్‌తో ఓ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది.
ALSO READ: పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అందుకే ఆపేశాడు..