ENGLISH

నాగార్జునకు నాని తమ్ముడా? కొడుకా?

13 March 2018-11:29 AM

నాగార్జున, నాని కాంబినేషన్‌లో క్రేజీ మల్టీ స్టారర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. మార్చి 18న ఈ కాంబినేషన్‌ సెట్స్‌ మీదికెళ్లనుంది. అయితే ఈ మల్టీ స్టారర్‌లో నాగార్జున, నాని మధ్య రిలేషన్‌ ఎలా ఉండబోతోందనే విషయంపైనే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ. 

యంగ్‌ హీరో నాని, సీనియర్‌ హీరో నాగార్జున. ఈ కాంబినేషన్‌ని ఎలా మ్యాచ్‌ చేయనున్నారో అనే ఆశక్తి ఆడియన్స్‌లో నెలకొంది. ఇదిలా ఉంటే, నాగార్జున, నానికి తండ్రిగా నటించబోతున్నాడంటూ మొదట్లో గాసిప్స్‌ వచ్చాయి. అయితే తాజాగా నాగ్‌, నాని అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారంటూ మరో గాసిప్‌ వినిపిస్తోంది. ఇవేమీ కాదు, ఈ ఇద్దరూ ఫ్రెండ్స్‌లా కనిపించబోతున్నారంటూ తాజా గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. 

ఇవన్నీ ఇలా ఉంటే, నాగార్జున అంటేనే టాలీవుడ్‌కి మన్మధుడు. అలాంటి మన మన్మధుడు ఈ సినిమాలో న్యూ గెటప్‌లో కనిపించబోతున్నాడట. ఆ న్యూ గెటప్‌ చాలా చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండబోతోందనీ సమాచారమ్‌. నాగార్జున విషయంలో 'హ్యాండ్‌సమ్‌' అనే మాట గురించి ప్రస్థావించనక్కర్లేదు. కానీ ఈ సినిమాలో నాగ్‌ గెటప్‌ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నాని అంటే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌. సీనియర్‌ హీరో అయినా కానీ ఏజ్‌లో యంగ్‌ హీరోస్‌తో పోటీ పడుతుంటాడు నాగార్జున. అందుకే ఈ రెండు క్యారెక్టర్స్‌ మధ్యా ఏజ్‌లో పెద్దగా డిఫరెన్స్‌ లేకుండా జాగ్రత్త పడుతున్నారట. 

ఏజ్‌లో పెద్దగా డిఫరెన్స్‌ చూపించకుండా ఉండాలంటే గురు, శిష్యుల క్యారెక్టర్స్‌ అయితే సూటవుతాయని భావిస్తున్నారట. సో గురుశిష్యుల్లా వీరిద్దరూ నటించే అవకాశాలున్నాయనీ తాజాగా టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా నాగార్జున మాత్రం హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో యంగ్‌ హీరో నానితో పోటీ పడడం మాత్రం ఖాయం.

ALSO READ: మరో ప్రముఖ నటి కూతురు సినీ ఎంట్రీ