ENGLISH

కాజల్‌ బికినీ హంగామా

31 May 2017-18:01 PM

బాలీవుడ్‌ సీనియర్‌ బ్యూటీ కాజోల్‌కి బోలెడంత మంది అభిమానులున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆమెకు అభిమానం గనం ఎక్కువే. ఎలాంటి పాత్రకైనా ఈజీగా ఒదిగిపోయే స్టామినా ఆమెది. ట్రెడిషనల్‌ లుక్‌లోనైనా, హాట్‌ లుక్‌లోనైనా కాజోల్‌కి సాటి మరొకరు లేరనే చెప్పాలి. కాజోల్‌, షారూఖ్‌ఖాన్‌ జంట ఎంతో నేచురల్‌గా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ని వివాహమాడిని తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా, ఈ మధ్యే సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్‌ చేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అదే గ్లామర్‌తో హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది. వయసు పెరిగినా కాజోల్‌లో గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదంటోంది. అందుకే ఇలా బికినీలో దర్శనమిచ్చింది. సమ్మర్‌ వెకేషన్‌ని బీచ్‌లో ఇలా ఎంజాయ్‌ చేస్తోంది కాజోల్‌ బ్యూటీ. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో దిగిన కాజోల్‌ బికినీ ఫోటోని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ పోస్ట్‌ పెట్టింది ఎవరో తెలుసా? కాజోల్‌ భర్త అజయ్‌ దేవ్‌గణ్‌. తన భార్యలో హాట్‌ అప్పీల్‌ ఇంకా తగ్గలేదు అనడానికి ఈ తాజా పిక్‌ నిదర్శనం అన్నట్లుగా ఉంది ఈ పిక్‌ చూస్తుంటే. కాజోల్‌ని ఇలా బికినీలో చూసి ఆమె అభిమానులు కొంచెం ముఖం చిన్నబుచ్చుకున్నా, మరో పక్క అవును నిజమే కాజోల్‌కి ఏమంత వయసైపోయిందనీ అనుకోకుండా ఉండలేకపోతున్నారు. 

 

ALSO READ: స్పైడర్ చిత్ర టీజర్ విడుదల సమయంలో మార్పు