ENGLISH

టచ్‌ చేసేశావ్‌ 'మామ్‌'

03 June 2017-18:36 PM

అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఇష్టపడని వారుండరు. ఇప్పటికీ నచ్చిన హీరోయిన్‌ ఎవరంటే జనరేషన్‌తో సంబంధం లేకుండా ఠక్కున శ్రీదేవి అనేస్తారు అందరూ. ప్రేక్షకులే కాదు, స్టార్‌ సెలబ్రిటీస్‌తో సహా శ్రీదేవికి ఆ క్రేజ్‌ ఉంది. ఆ శ్రీదేవి ఇప్పుడు 'మామ్‌' అనే సినిమాలో నటిస్తోంది. గతంలో హీరోయిన్‌గా బోలెడంత అభిమానం సంపాదించుకున్న శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్‌ చేసింది. 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కూతురి కోసం పరితపించే తల్లిగా శ్రీదేవి 'మామ్‌' సినిమాలో కనిపించనుంది. 'మామ్‌' ట్రైలర్‌ వచ్చింది. ట్రైలర్‌ చూసినవారంతా శ్రీదేవి నటనకు ఫిదా అవుతున్నారు. జులై 7న ఈ 'మామ్‌' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సజల్‌ అలీ, అద్నాన్‌ సిద్ధికీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తుండడం గమనించదగ్గది. వీరిద్దరూ పాకిస్తానీ నటులు. రవి ఉద్యవర్‌ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ చిత్రానికి నిర్మాత కాగా, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. దేవుడు అన్ని చోట్లా ఉండటం సాధ్యం కాక అమ్మని సృష్టించాడనే మాట మనం అంటుంటాం. దాన్నే ఈ సినిమాలో డైలాగ్‌గా పెట్టారు. ఆ డైలాగ్‌తోనే శ్రీదేవి అందర్నీ టచ్‌ చేసేసింది. ఇంతవరకూ ఆమె అతిలోక సుందరి అయితే ఇప్పుడు ఈ సినిమాతో అందరికీ 'మామ్‌'అయిపోయింది.