ENGLISH

నితిన్‌ 'స్వీట్‌' రిస్క్‌ చేసేస్తున్నాడట

30 May 2017-18:18 PM

'అ,ఆ..' సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. ఈ సినిమాతో నితిన్‌కి స్టార్‌డమ్‌ వచ్చేసింది. దాంతో నితిన్‌ తర్వాత చేయబోయే సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అదే 'లై' సినిమా. టైటిల్‌లోనే ఏదో కిక్‌ ఉంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మరీ ఆశక్తిని రేకెత్తించాడు నితిన్‌. 'అఆ' తర్వాత నితిన్‌ మార్కెట్‌ పెరిగినా, ఆ సినిమా అంతలా వసూళ్ళు సాధించడానికి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'బ్రాండ్‌' కారణం అని చెప్పక తప్పదు. త్రివిక్రమ్‌ అన్న పేరుకి ఉన్న బ్రాండ్‌ వాల్యూ అలాంటిది. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'లై' సినిమా పక్కా యాక్షన్‌ మూవీగా రూపొందుతోంది. అమెరికాలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాలో ఛేజింగ్‌ సీన్స్‌ అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్‌ హను రాఘవపూడి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, యాక్షన్‌ సీన్స్‌ కూడా బాగా కుదిరాయి ఆ సినిమాకి. అలాగే 'లై' కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అట. ఇంటలెక్చువల్‌గా ఉండే సినిమా అట. దీనికోసం భారీగా ఖర్చు చేశారు. తాము చేస్తున్న ఈ స్వీట్‌ రిస్క్‌ సత్ఫలితాలిస్తుందని చిత్ర యూనిట్‌ నమ్మకంతో ఉంది. ఫైట్‌ మాస్టర్‌ కిచా డైరెక్షన్‌లో యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేస్తున్నాడు నితిన్‌. నితిన్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ బెస్ట్‌ యాక్షన్‌ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

ALSO READ: మళ్ళీ ఆసుపత్రికి దాసరి?!