ENGLISH

'బాహుబలి' పెళ్ళంట - అమ్మాయెవరో!

30 May 2017-18:10 PM

'బాహుబలి' సినిమాతో బీభత్సమైన స్టార్‌డమ్‌ వచ్చేసింది ప్రబాస్‌కి. కానీ ఒక్కటే లోటు. ఎక్కడికెళ్లినా ప్రబాస్‌ ముందు వాలిపోయే ప్రశ్న. 'బాహుబలి' నీ పెళ్లెప్పుడు? అని.. ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. ఎందుకంటే ప్రబాస్‌కి పెళ్లి కుదిరిందంటూ వార్తలొస్తున్నాయి. పెళ్లికూతురు భీమవరం అమ్మాయట అంటూ గాసిప్స్‌ బాగా వినిపిస్తున్నాయి. 'బాహుబలి' సినిమా కోసం తన కెరీర్‌లో నాలుగేళ్లు కేటాయించేశాడు ప్రబాస్‌. పెళ్లెప్పుడు అంటే 'బాహుబలి' సినిమా తర్వాతే అంటూ తప్పించేసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా పూర్తయిపోయింది. అందరి దృష్టీ ప్రబాస్‌ పెళ్లి పైనే ఉంది. దాంతో ప్రబాస్‌ కూడా ఇక పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేశాడని సమాచారమ్‌. అందులో భాగంగానే భీమవరానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమారైతో ప్రబాస్‌ పెళ్లి చేయాలని నిశ్చయించినట్లు తెలయ వస్తోంది. అయితే ఇంతవరకూ ఈ విషయంపై ప్రబాస్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రబాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆయన్ని పెళ్లికొడుకుగా చూడాలని ఆశపడుతున్నారు. ఫ్యాన్స్‌ కోరిక మేరకు ఈ ఏడాదిలో ప్రబాస్‌ పెళ్లి పీటలెక్కుతాడో లేదో చూడాలి. మరో పక్క ప్రబాస్‌ 'బాహుబలి' సినిమా తర్వాత 'సాహో' సినిమాతో బిజీ అయిపోయాడు. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. 'బాహుబలి' తెచ్చిపెట్టిన స్టార్‌డమ్‌తో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలున్నాయి. 

 

ALSO READ: మళ్ళీ ఆసుపత్రికి దాసరి?!