ENGLISH

భ్రమరాంబ ది స్టైల్‌ ఐకాన్‌

30 May 2017-18:09 PM

'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా తర్వాత అందరి నోటా వినబడుతున్న మాట భ్రమరాంబ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా రకులే ఎక్కువ పాల్గొంటోంది. ఈ సినిమాలో రకుల్‌ ట్రెడిషనల్‌ గెటప్‌తో ఆకర్షించింది. సినిమాలోనే కాదండోయ్‌, రకుల్‌ ఏ ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసినా, ఏ ఇతర ఇంటర్వ్యూలకి అటెండ్‌ అయినా కానీ, ట్రెడిషనల్‌ వేర్‌లోనే దర్శనమిస్తోంది. ఆ ట్రెడిషన్‌కే మోడ్రన్‌ టచ్‌ ఇస్తూ, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వతహాగా రకుల్‌కి డిజైనింగ్‌పై ఇంట్రెస్ట్‌ ఉండడంతో తన డ్రస్సుల్ని తానే దగ్గరుండి డిజైన్‌ చేయించుకుంటుందట. కొత్త కొత్త స్టైల్స్‌ని ఫాలో అవుతూ, ట్రెండ్స్‌ని క్రియేట్‌ చేస్తోంది. రకుల్‌ అంటేనే అందరిలోనూ వెరీ వెరీ స్పెషల్‌. ఆమె నటన, మాట్లాడే తీరు, అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. నార్త్‌ ఇండియన్‌ అమ్మాయి అయినా కానీ, తనను ఇంతగా ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంటోనే తెలుగు భాషపై పట్టు సాధించింది. అంతేకాదు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. ఇలాంటి స్పెషల్‌ క్వాలిటీస్‌ రకుల్‌లో చాలా ఉన్నాయి. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టడమే కాదండీ, రకుల్‌లా ఇలా డెడికేటెడ్‌గా పనిచేసేవాళ్లు ఎంతమంది ఉంటారు హీరోయిన్స్‌లో. అందుకే రకుల్‌ ఎప్పటికీ స్పెషల్‌. ఏం చేసినా స్పెషల్‌. 

 

ALSO READ: మళ్ళీ ఆసుపత్రికి దాసరి?!