ENGLISH

ఏ ఎక్స్‌ప్రెషన్‌ అయినా దిశా గ్లామరే టాప్‌.!

15 June 2018-15:40 PM

ఫోటోకి ప్రాణం పోసేది ఎక్స్‌ప్రెషన్‌. అయితే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ కొన్ని భావాలను తెలియపరుస్తుంటాయి. అలా తన భావాల్ని ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ ద్వారా చూపించే ముద్దుగుమ్మ దిశా పటానీ. 

గ్లామరే కాదు, ఎక్స్‌ప్రెషన్‌ విషయంలోనూ చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందీ బ్యూటీ. ఆకట్టుకునే ఫిజిక్‌తో పాటు, ఎన్నో భావాలు పలికించగల ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ ఫీచర్స్‌ కలిగిన ఈ ముద్దుగుమ్మ కాస్త లేటుగా అయినా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో మెగా ప్రిన్స్‌ వరుణ్‌తో 'లోఫర్‌' సినిమాలో నటించిన ఈ హాట్‌ బ్యూటీ, ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తమిళంలో ప్రతిష్ఠాత్మక చిత్రం 'సంఘమిత్ర'లో నటిస్తోంది. హిందీలో హృతిక్‌ రోషన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌తో జత కడుతోంది. 


ఇక ఈ తాజా పిక్‌ విషయానికి వస్తే, వర్ణించడం సాధ్యం కాకుండా పిల్లగాలికి ఆమె ముంగురులు అలా అలా కదులుతుంటే, తన్మయత్వం పొందుతున్న ఆమె ముఖ కవలికలు చూస్తున్న మనల్ని కూడా మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నట్లు లేదూ.!

ALSO READ: సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్