ENGLISH

బికినీ అందం చూడవయా.. ఆనందించయా!

20 November 2020-18:30 PM

బికినీ పోజులతో ఎలా అభిమానుల్ని రెచ్చగొట్టాలో బాగా తెలిసిన అందాల భామ దిశా పటానీ, ఇంకోసారి తనదైన గ్లామర్‌తో కిర్రాకు పుట్టించేస్తోంది. నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌.. అని ప్రతిసారీ అనిపించేస్తుంటుంది ఆమె గ్లామర్‌. తాజాగా ఇంకోసారి బికినీ సౌందర్యాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆరబోసేసిన దిశా పటానీ ‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అంటోంది.

 

‘అయినా మా బికినీ కష్టాలు మీకేం తెలుసు? ఆ పోజు ఇవ్వడానికి చాలా చాలా కష్టపడాలి.. నెలల తరబడి వ్యాయామం చేయాలి.. రోజుల తరబడి డైటింగ్‌ చేయాలి.. గంటల తరబడి కష్టపడాలి..’ అంటూ తన బికినీ కష్టాల గురించి చెప్పింది దిశా పటానీ. అవును మరి, బికినీలో పొటో సెషన్‌ అంటే.. అది ఆషామాషీ వ్యవహారం కాదు. పొట్ట కండరాలు కనిపించీ, కనిపించకుండా వుండాలి. ఒంపు సొంపులు అత్యద్భుతంగా ఎలివేట్‌ అవ్వాలి.

 

అదంతా ఓ గ్లామరస్‌ ఆర్ట్‌.. అని చెబుతుంటారు అందాల భామలు. దిశా పటానీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. నిత్యం చాలా కష్టతరమైన వ్యాయామాలు చేసేస్తుంటుంది దిశా పటానీ. అయినాసరే, వాటికి మించి కసరత్తులు చేస్తే తప్ప బికినీ యాక్ట్‌ అద్భుతంగా వచ్చే అవకాశాల్లేవని దిశా పటానీ అంటోంది. ఆమె అంతలా కష్టపడుతుంది కాబట్టి.. ఇష్టమైన కష్టాన్ని ఎంజాయ్‌ చేస్తుంటారు ఆమె అభిమానులు.. ఆమెను బికినీ ఫొటోల్లో చూసి.

ALSO READ: Disha Patani Latest Photoshoot