ENGLISH

దిశా కిర్రాక్‌ ర్యాంప్‌ వాక్‌

19 August 2017-16:31 PM

ర్యాంప్‌ వాక్‌లో అదరగొట్టేసింది ముద్దుగుమ్మ దిశా పటానీ. స్టైలింగ్‌ దగ్గర్నుంచి యాటిట్యూడ్‌ వరకూ దిశా సూపరంటే సూపరంతే. ఈ హాట్‌ బ్యూటీ మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకొచ్చింది. సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మోడలింగ్‌లో ఇంకా ఎంతో చెయ్యాల్సి ఉందని చెప్పడం దిశా పటానీకే చెల్లింది. అందం అంటే ఎక్స్‌పోజింగ్‌ ఒక్కటే కాదని చెప్పే దిశా పటానీ ఇప్పుడున్న గ్లామర్‌ ప్రపంచంలో అందాన్ని దాచుకోకూడదని క్లాస్‌ తీసుకుంటుంది. అందుకేనేమో ఎక్స్‌పోజింగ్‌ విషయంలో అస్సలేమాత్రం మొహమాటపడదు దిశా పటానీ. అదే ఆమెకు అవకాశాల్ని కూడా తెచ్చిపెడ్తుందిలెండి.

ALSO READ: సెట్స్‌ మీదికి వెళ్లనున్న కేసీఆర్‌ సినిమా